News March 2, 2025
జనగామ: ఈనెల 5న మెగా ఉద్యోగ మేళా

జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టెక్ మహీంద్రా, జెన్ పాక్ట్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హెల్త్ కేర్, తదితర కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9912437032 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం

గుంటూరు- పెదకూరపాడు స్టేషన్ల మధ్యలో రన్నింగ్ ట్రైన్లో మహిళ(35)పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు.. రాజమండ్రిలో ఓ మహిళ సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కారు. సోమవారం రాత్రి రైలులోని మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెను దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పెదకూరపాడు స్టేషన్లో దిగి పారిపోయాడు. బాధితురాలు మంగళవారం చర్లపల్లికి రాగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News October 15, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున క్షేత్రస్థాయిలో పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సూచించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో గర్భిణీ స్త్రీల నమోదును 12 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
News October 15, 2025
పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.