News March 5, 2025
జనగామ: ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గల ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. ఈవీఎం వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ జిల్లాలో 1,600 MSME యూనిట్ల లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది రూ.260 కోట్లతో 1,600 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పరిశ్రమల CGM ఎం. మధు తెలిపారు. వీటి ద్వారా 8,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 997 యూనిట్లతో 5,045 మందికి ఉపాధి కల్పించామని, మిగిలిన లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం చివరిలోపు చేరుకుంటామని స్పష్టం చేశారు.