News February 7, 2025
జనగామ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేయించాలని, ఈనెల 15లోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని అదే విధంగా పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.
Similar News
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్పూర్లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
హుజూరాబాద్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 8, 2025
వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం
AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.