News February 8, 2025
జనగామ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేయించాలని, ఈనెల 15లోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని అదే విధంగా పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.
Similar News
News March 1, 2026
భీమవరం: కలెక్టర్ ఇచ్చిన ఫ్రీజర్లు.. 2 రోజులకే ధ్వంసం

గత నెలలో భీమవరం ఆస్పత్రిలో ఫ్రీజర్ మరమ్మతులకు గురై ఓ మృతదేహాన్ని రాత్రంతా అలాగే ఉంచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించి రూ.2,60,000 నిధులతో 2 కొత్త ఫ్రీజర్లను ఆస్పత్రికి అందించారు. అయితే 2 రోజులకే దుండగులు వాటిలోని కాపర్ వైర్లను కట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.
News March 1, 2026
నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.
News March 1, 2026
వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


