News February 19, 2025
జనగామ: ఉపాధ్యాయుడిగా మారిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని శామీర్ పేటలో గల టీజీఎంఆర్ఈఐఎస్ బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్ సందర్శించి వసతి గృహంలో వసతి సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 22, 2025
నాగర్కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు

నాగర్కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ శనివారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 22, 2025
NMMS-2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

జిల్లాలో రేపు జరగనున్న NMMS-2025 స్కాలర్షిప్ పరీక్షకు 1474 మంది 8వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు. జగిత్యాలలో 3, కోరుట్లలో 2, మెట్పల్లిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 22, 2025
మంచిర్యాల: త్వరలో వాట్సాప్ నంబర్ ఏర్పాటు

సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీ అండ్ ఎంబీ బలరామ్ తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారన్నారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


