News February 27, 2025

జనగామ: ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్

image

జనగామ జిల్లా పరిధిలో జరుగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణను జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 3, 2025

MBNR: దసరా EFFECT.. మాంసం దుకాణాలు కిటకిట

image

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి సహా పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా దుకాణాలు బంద్ కావడంతో, ఇవాళ మాంసం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

News October 3, 2025

RK రోజా ఇంట్లో విజయదశమి వేడుకలు

image

మాజీ మంత్రి RK రోజా ఇంట్లో నవదుర్గల పూజను గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఆరాధించడం ద్వారా భక్తులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, విజ్ఞానం ప్రసాదిస్తుందని కుటుంబంలో సౌఖ్యం, ధైర్యం, ఆత్మబలం పెరుగుతాయని సమాజంలో శాంతి, సమగ్రత నెలకొంటుందని తెలిపారు. పిల్లలను దేవుళ్ళుగా భావించి, వారికి రోజా పాదపూజ చేశారు. అనంతరం వారికి భోజనం పెట్టి దుర్గమ్మ చల్లని చూపు ఉండాలన్నారు.
.

News October 3, 2025

HYD: పెద్దనాన్న వేధింపుతో విద్యార్థిని సూసైడ్

image

సొంత పెద్దన్నాన అత్యాచార వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. కొంపల్లిలోని పోచమ్మ గడ్డలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకగా పెద్దనాన్నే కాలయముడయ్యాడని తేలింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.