News February 27, 2025

జనగామ: ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్

image

జనగామ జిల్లా పరిధిలో జరుగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణను జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

image

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్‌కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

News March 18, 2025

నల్గొండ: ఎల్ఆర్ఎస్ 25% రిబేట్‌కు స్పందన

image

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25% రిబెట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4 లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25% రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.

News March 18, 2025

TGPSC ఫలితాల్లో సత్తా చాటిన ‘అయిజ’ యువతి

image

సోమవారం TGPSC విడుదల చేసిన ఫలితాల్లో అయిజ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రాణెమ్మ దేవన్న చిన్న కుమార్తె అయిన సునీత గట్టు గురుకులాల్లో చదివి, SC స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటిన ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సునీత తెలిపింది. ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.

error: Content is protected !!