News March 25, 2025
జనగామ: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను పరిశీలించిన కలెక్టర్

జనగామ పురపాలిక పరిధిలో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ ప్లాట్ల ఆన్లైన్ నిశితంగా పర్యవేక్షించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు పూర్తిస్థాయి రుసుమును చెల్లించాలన్నారు.
Similar News
News March 31, 2025
హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.
News March 31, 2025
కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు

విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.
News March 31, 2025
ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.