News July 9, 2024
జనగామ: ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కార్యదర్శిని సంప్రదించారు. ఈ క్రమంలో కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు. నేడు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నారు.
Similar News
News December 12, 2024
భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని వినతి
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కలిశారు. గూడూరు మండల పరిధిలోని భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని కోరారు. స్థానిక గిరిజన యువత ఉపాధి కల్పించుటకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు కేంద్రం మంత్రితో హుస్సేన్ నాయక్ చర్చించారు.
News December 12, 2024
కేయూ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
News December 12, 2024
WGL: రైతులను కలవరపెడుతున్న కత్తెర పురుగు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులకు కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఐదేళ్లుగా ఈ పురుగు క్రమంగా పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పంటలను క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలు చేస్తున్నారు.