News January 31, 2025

జనగామ: కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

జనగామ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో కంది పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కంది పంట సాగు చేసిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా క్వింటాకు మద్దతు ధర రూ.7,550లు కల్పించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పంటను ప్రమాణాల కనుగుణంగా శుభ్రపరచి AEO వద్ద ధ్రువీకరణ, పట్టాదారు పాసుబుక్, ఆధార్, బ్యాంకు జిరాక్స్ తీసుకురావాలన్నారు.

Similar News

News November 24, 2025

బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

image

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్‌తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన‌ పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్‌గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 24, 2025

4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 24, 2025

ASPT: మనవడి మరణం తట్టుకోలేక నాయనమ్మ మృతి

image

అశ్వారావుపేట మండలం దొంతికుంటలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందాడు. మనవడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.