News April 6, 2024
జనగామ: కరెంట్ పనులు చేస్తుండగా.. షాక్‌తో మృతి

విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. తీగారం గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం శనివారం ముత్తారం గ్రామశివారులో విద్యుత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో మరణించాడు. ఇతను వల్మిడిలో విద్యుత్తు కట్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 27, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News October 27, 2025
డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.
News October 26, 2025
సోమవారం ‘ప్రజావాణి’ రద్దు: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం(అక్టోబర్ 27) నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.


