News February 26, 2026

జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బదిలీ

image

జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్న రిజ్వాన్ భాషా షేక్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయనను జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది. కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝాను జనగామ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News April 15, 2026

న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

image

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్‌లైన్ కాల్‌కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News April 15, 2026

కరీంనగర్‌లో ఠాగూర్ సీన్ రిపీట్..!

image

KNRలో ఠాగూర్ సినిమాలోని సీన్‌ రిపీటైంది. వేములవాడ(M) శాత్రాజ్‌పల్లికి చెందిన సాహెబ్ బీ(60) గుండెవ్యాధితో కోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న సర్జరీ చేయగా మృతిచెందింది. బతికే ఉన్నట్లు, వైద్యం చేస్తున్నట్లు కుటుంబసభ్యులను మభ్యపెడుతుండగా, అనుమానంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. డాక్టర్లపై KNR-2 టౌన్ PSలో కేసు నమోదైంది.

News April 15, 2026

నేడు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరులో CHC ప్రారంభం, పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.