News March 7, 2025

జనగామ: కల్లు తాగిన ఎర్రబెల్లి 

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దావుల వెంకన్న కుమారుడు గణేశ్-శరణ్య వివాహం జరుగగా ఈరోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారి ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి వెళుతుండగా మాజీ మంత్రిని పిలిచి కల్లు తాగాలని బీఆర్ఎస్ ఉద్యమకారుడు, గౌడ సంఘం నేత కోల సోమయ్య గౌడ్ కోరగా అభిమాని కోరిక మేరకు తాటికల్లు తాగి ఆనందం వ్యక్తపరిచారు. 

Similar News

News February 28, 2026

వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.

News February 28, 2026

అవకాడోతో కురులకు మేలు

image

అవకాడో కురుల పెరుగుదలకు కూడా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్‌తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్‌ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

News February 28, 2026

GHMC స్థానంలో కోర్ అర్బన్ చట్టం

image

ORR పరిధి 3 కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.