News March 7, 2025
జనగామ: కల్లు తాగిన ఎర్రబెల్లి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దావుల వెంకన్న కుమారుడు గణేశ్-శరణ్య వివాహం జరుగగా ఈరోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారి ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి వెళుతుండగా మాజీ మంత్రిని పిలిచి కల్లు తాగాలని బీఆర్ఎస్ ఉద్యమకారుడు, గౌడ సంఘం నేత కోల సోమయ్య గౌడ్ కోరగా అభిమాని కోరిక మేరకు తాటికల్లు తాగి ఆనందం వ్యక్తపరిచారు.
Similar News
News February 12, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు షుగర్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటాయి. వీటిని గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 12, 2026
NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
News February 12, 2026
నిర్మల్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


