News March 20, 2025
జనగామ: కాళేశ్వరానికి భారీ నిధులు

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.
Similar News
News November 29, 2025
మంత్రి వద్దన్నా.. రేణిగుంటలో మళ్లీ పోస్టింగ్.!

అవినీతి ఆరోపణలతో సస్పెండైన రేణిగుంట రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి మళ్లీ అక్కడే పోస్టింగ్ పొందారు. ఆయనకు ఉద్యోగం ఇవ్వాలంటూ స్పెషల్ CS పంపిన ఫైల్ను మంత్రి అనగాని తిరస్కరించారు. ఇందుకు విరుద్ధంగా ఇటీవల చిత్తూరు రిజిస్ట్రేషన్ శాఖ ఇన్ఛార్జ్ DIGగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఆనంద్కు మళ్లీ రేణిగుంటలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆనంద్ రేంజ్ ఏంటో అర్థమవుతుందని పలువురు చర్చించుకుటున్నారు.
News November 29, 2025
GNT: సైలెంట్ అయిపోయిన సీనియర్ నేతలు

గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి ఇంటికే పరిమితమయ్యారు. అటు వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి, ఇటీవలే టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ మారిన తర్వాత ఆయన యాక్టివ్గా లేకపోవడం కార్యకర్తలను సైతం అయోమయానికి గురిచేస్తోంది.
News November 29, 2025
‘దిత్వా’ తుఫాను.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ‘దిత్వా’ తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు CTR, TPT, ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నెల్లూరు, CTR, TPT, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.


