News March 21, 2025
జనగామ: కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో విశేష సేవలందించిన కళాకారులకు కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందజేస్తోంది. జనగామ జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డ్ గ్రహీతలకు రూ.25 వేలు నగదు, చేనేత శాలువా, మెమెంటోతో పాటు మెరిట్ సర్టిఫికెట్తో సత్కరించటం జరుగుతుందన్నారు. 30సం.ల వయస్సు, 10 సం.ల అనుభవం ఉండాలన్నారు.
Similar News
News November 17, 2025
తూ.గో: ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ సాగు

తూ.గో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి పోను రూ.1.50 లక్షలు ఆదాయం లభిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ రూ.19,636 పలుకుతుంది. రూ.16 వేలు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట రూ.23 వేలు పైబడి ధర లభించింది. జిల్లా వ్యాప్తంగా 48,992 ఎకరాల్లో సాగవుతోందని ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జునరావు తెలిపారు.
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.


