News March 30, 2025
జనగామ: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. జనగామ జిల్లాలో త్వరలో జరిగే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
Similar News
News April 18, 2025
NRML: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కుంచెపుబాబు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా ఓ వ్యక్తి బ్లేడుతో మెడపై కోశాడు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న బాధితుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకొని బ్లేడ్‌తో బాబు మెడపై కట్ చేశాడని రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే తమకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.
News April 18, 2025
HYDలో కాంగ్రెస్, BRS లేకుండా ఎన్నికలు!

ఎన్నికలు వస్తే అధికార, ప్రతిపక్షాల మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అదేంటోగాని మన HYDలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకేనేమో ఈసారి MLC ఎన్నికల్లో INC, BRS దూరంగా ఉంటున్నాయి. ఇక గెలుపు కష్టమని తెలిసినా BJP డేర్ చేసింది. అభ్యర్థిని బరిలో నిలిపి బలం కూడబెట్టే ప్రయత్నం చేస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న MIM గెలుపు ధీమాతో ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే INC, BRS ఈ ఎన్నికపై నోరు మెదపకపోవడం గమనార్హం.
News April 18, 2025
NZB: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు