News February 1, 2025
జనగామ: గుండెపోటుతో వ్యక్తి మృతి

జనగామ పట్టణానికి చెందిన తమ్మడి నర్సింగరావు(55) గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి స్వస్థలం రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ కాగా.. గత కొన్నేళ్లుగా జనగామలో నివసిస్తున్నారు. నేడు సాయంత్రం జనగామలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Similar News
News November 3, 2025
పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఫుడ్ పెడుతున్నారా?

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్‌ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా? COMMENT
News November 3, 2025
బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
పొలాసలో కొత్త ఆటోమేటిక్ వెదర్ స్టేషన్

జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో భారత వాతావరణ విభాగం ఆధ్వర్యంలో కొత్త ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ స్థాపన పనులు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రంలో గాలి ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి వేగం, దిశ, వర్షపాతం, వాతావరణ పీడనం, సౌర కిరణ శక్తి వంటి పరిమితులతో పాటు మట్టి ఉష్ణోగ్రత, మట్టి తేమ శాతం కొలిచే సెన్సర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.


