News October 16, 2024
జనగామ: గుండెపోటుతో హోంగార్డ్ మృతి
గుండెపోటుతో హోంగార్డ్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడకండ్ల పోలీస్ స్టేషన్లో ఎండి గౌస్ పాషా(48) హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, పాషా గతంలో దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వహించారు. అందరితో సన్నిహితంగా ఉండే పాషా గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 11, 2024
భూపాలపల్లి : గోదావరి నదికి మహా హారతి కార్యక్రమం
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కార్తీక మాసం ప్రతి సోమవారం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగముగా సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రధాన రాజ గోపురం నుంచి మంగళవాయిద్యాలతో గోదావరి నది వద్దకు బయలుదేరి ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి పాల్గొన్నారు.
News November 11, 2024
చిల్పూర్: కుమారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు
తమ ముగ్గురు కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకట కిష్టయ్య, ఆయన భార్య సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. 30 గుంటల భూమి అమ్ముకోగా వచ్చిన రూ.26 లక్షల రూపాయలు ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ ఫిర్యాదును స్వీకరించి తమ కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 11, 2024
నిరంతరం పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి: మంత్రి
ప్రజలతో, ప్రజల కోసం.. నిరంతరం పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. మరేన్ని దుర్మార్గాలు చేసినా.. తానేప్పుడు ప్రజాసేవని పక్కన పెట్టలేదని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి సురేఖ చెప్పారు.