News March 31, 2025
జనగామ: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

జనగామ జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇళ్లు ఇప్పిస్తామని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 16, 2025
పెద్దపల్లిలో సమావేశమైన బీజేపీ నేతలు

సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా పఖ్వాడా కార్యక్రమాలపై పెద్దపల్లి జిల్లా నేతలు నేడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వదేశీ, ఆత్మనిర్భర్ సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వీటిలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్ల మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News September 16, 2025
డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
News September 16, 2025
సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.