News February 8, 2025
జనగామ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో జనగామ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News March 7, 2026
RGM: గ్రామాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన

రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం సుడిగాలి పర్యటన చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్, పశు వైద్య శాఖ అధికారి కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందనపల్లిలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల వంటగదిని పరిశీలించారు. లింగాపూర్‌లో జరుగుతున్న R&B రోడ్డు, పైప్‌లైన్ పనులను పరిశీలించారు. రామగుండం ZP స్కూల్లో అదనపు గదుల నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
News March 7, 2026
ఇంటర్ పరీక్షలకు 577 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక్ తెలిపారు. పరీక్షలకు సెట్-2 ప్రశ్నపత్రాన్ని ఉపయోగించామన్నారు. 6,126 మంది జనరల్ విద్యార్థులలో 5,767 మంది హాజరు కాగా 359 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,178 మందకి గాను 1,960 మంది హాజరు కాగా 218 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు CC కెమెరాల పర్యవేక్షణలో సాగాయన్నారు.
News March 7, 2026
పాడేరు: ‘సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి’

రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ప్రణాళికతో అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర @ 2047” లక్ష్యాలను ప్రజలకు ముందుకు విస్తృతంగా చేరవేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీనిపై రూపొందించిన ప్రత్యేక కేలండర్‌ను శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకొని 2047కు సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కార్యాచరణతో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


