News March 20, 2025
జనగామ: గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. అలాగే చలివేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలని, తాగునీరు, గ్లాసులు, కుండలు, వాటిపై ప్లేట్లు ఉండాలని, అవన్నీ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం తగదని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, ఎంపీ దుర్గాప్రసాద్‌తో కలిసి సమితి వినతిపత్రం సమర్పించారు. రాయలసీమ అభివృద్ధికి డివిజన్ అవసరమని తెలిపారు. రేణిగుంట, తిరుచానూరు స్టేషన్ల అభివృద్ధితో పాటు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్‌లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.


