News March 10, 2025
జనగామ జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 14, 2026
కామారెడ్డి: “అరైవ్-అలైవ్” ఒక ఉద్యమం కావాలి: డీజీపీ

రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ముఖ్యమని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 300 మందికి హెల్మెట్లు, డ్రైవర్లకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ప్రమాదాల నివారణపై ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.
News April 14, 2026
పిల్లులు సగం ఆహారమే ఎందుకు తింటాయి?

సాధారణంగా పెంపుడు పిల్లులు పెట్టిన ఆహారంలో సగమే తిని మిగతాది వదిలేస్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఆహారం తాలూకు వాసన వాటికి బోర్ కొట్టడమేనని పరిశోధనల్లో తేలింది. ఎంత మంచి ఆహారం అయినా సరే రోజూ అదే పెడితే పిల్లులు క్రమంగా దాన్ని తినడం తగ్గించేస్తాయట. వేర్వేరు రకాల ఆహారం పెడుతూ ఉంటే అవి తినేందుకు ఆసక్తి చూపిస్తాయని.. ఆకలి కంటే కూడా వాసనకే ప్రాధాన్యం ఇస్తాయని రీసెర్చ్ పేర్కొంది.
News April 14, 2026
అనంతపురంలో భార్య గొంతు కోసిన భర్త..!

తాళి కట్టిన భర్త భార్య గొంతును కోసిన ఘటన అనంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని సైఫుల్లా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య గొంతు కోస్తున్న సమయంలో అడ్డువచ్చిన వ్యక్తిపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం బాధితుణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, రక్షకుడైన క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


