News March 16, 2025

జనగామ జిల్లాలో చికెన్ ధరల వివరాలు

image

జనగామలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. శనివారం కిలో చికెన్ రూ.145 నుంచి రూ.165 వరకు అమ్మారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్‌, చేపల దుకాణాల వైపు మొగ్గు చూపడంతో‌ చికెన్ అమ్మకాలు తగ్గాయి. ఇక సోమవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్‌ స్కిన్ కేజీ రూ.165, స్కిన్‌లెస్‌ కేజీ రూ.145గా ధర నిర్ణయించారు. ఫాం రేటు రూ.78, రిటైల్ రూ.100ఉంది. కాగా నిన్న, నేడు ఒకే ధరతో అమ్మకాలు జరుగుతున్నాయి.

Similar News

News September 13, 2025

యాకుత్‌పురా ఘ‌ట‌న‌కు.. బాధ్యుల‌పై హైడ్రా చ‌ర్య‌లు

image

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధ‌వారం సిల్ట్‌ను తొల‌గించ‌డానికి తెర‌చిన మ్యాన్ హోల్ మూయ‌క‌పోవ‌డంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో డీఆర్ఎఫ్ సూప‌ర్‌వైజర్లు ఇద్ద‌రికి డిమోషన్, ఇద్ద‌రిని తొల‌గించాలని ఆదేశించింది.

News September 13, 2025

ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

image

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News September 13, 2025

ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

image

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.