News February 24, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
> అధికారం శాశ్వతం కాదు: ఎర్రబెల్లి
> రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> జిల్లాలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు
> పాలకుర్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
> చెరువులను నింపి నీళ్లు అందించాలి: ఎమ్మెల్యే పల్లా
> జిల్లాలోని పలు ఆలయాలలో శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Similar News

News December 6, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి శ్రీవాణి

image

డిసెంబర్ 21, 2025న నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై శనివారం నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

కరీంనగర్‌: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.