News February 26, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొడకండ్ల: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ సంబరాలు జరుపుకున్న గ్రామస్థులు > బీఆర్ఎస్లో చేరిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పలు పార్టీల నేతలు > 10వ తరగతి పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి: కలెక్టర్ > అందంగా ముస్తాబైన పాలకుర్తి సోమేశ్వర ఆలయం > విద్యుత్ అధికారులకు కీలక ఆదేశాలు జారి చేసిన జిల్లా కలెక్టర్ > పాలకుర్తిలోని పలు ఫర్టిలైజర్ షాప్లను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు
Similar News
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News November 20, 2025
HNK: TASK ఆధ్వర్యంలో టెక్నికల్ కోర్సులకు శిక్షణ

చైతన్య యూనివర్సిటీలోని TASK ఆఫీసులో టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. Java, Python, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudo కోడ్, C, C++, HTML, CSS, Java Scriptపై కోచింగ్ ఇస్తారని, డిగ్రీ, B.TECH, PG పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బ్యాంకింగ్, పోటీ పరీక్షల నిమిత్తం ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కోచింగ్ ఇవ్వనున్నారు.
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.


