News February 28, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు

Similar News

News October 21, 2025

NZB: కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలూర మండలం సాలెంపాడ్ క్యాంపుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

News October 21, 2025

రికార్డుల మోత.. దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం

image

దేశవ్యాప్తంగా దీపావళి మోత మోగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 25 శాతం (రూ.4.25 లక్షల కోట్లు) సేల్స్ పెరిగినట్లు CAIT సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 87% మంది స్వదేశీ ఉత్పత్తులనే ఇష్టపడుతున్నారని, దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గిందని తెలిపారు.

News October 21, 2025

మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

image

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్‌ను ప్రారంభించారు.