News March 20, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎండిపోయిన పంట పొలాలకు రూ.25 వేలు ఇవ్వాలని దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతల నిరసన, ధర్నా
> 12వ రోజు ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు
> బచ్చన్నపేట: విద్యుత్ ఘాతంతో వృద్ధురాలు మృతి
> ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
> పీసీసీ అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
> జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు
> 100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్
> ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి కలెక్టర్

Similar News

News December 3, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

image

పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని నామినేషన్ కేంద్రాలను పెద్దపల్లి DCP భూక్య రామిరెడ్డి, పెద్దపల్లి ACP గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను జరపాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ వెంట సీఐ ప్రవీణ్ కుమార్, గ్రామీణ ఎస్సై మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత ఉన్నారు.

News December 3, 2025

మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

image

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్‌ కిడ్‌’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.

News December 3, 2025

కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

image

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.