News March 30, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> బచ్చన్నపేట: జీతాలు రాక ఇబ్బంది పడుతున్న జీపీ కార్మికులు > పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే > జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగిన 10వ తరగతి పరీక్షలు > పాలకుర్తిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు > జయంతి ఉత్సవాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం > జిల్లా వాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ > ఇఫ్తార్ విందులో పాల్గొన్న యశస్విని రెడ్డి, కడియం.
Similar News
News October 28, 2025
తిరుమల: 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. ఈసారి కూడా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అమలు చేస్తామని ప్రకటించారు. కేవలం 2రోజులే ఈ దర్శనాలకు భక్తులను అనుమతించాలన్న ఆలోచన తమది కాదని స్పష్టం చేశారు. తొక్కిసలాట జరగకుండా భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. కేవలం రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోందని భూమన ఆరోపించిన విషయం తెలిసిందే.
News October 28, 2025
జగిత్యాల: ‘సీనియర్ సీఆర్పీల సేవలు వినియోగించుకోవాలి’

వరంగల్ మహా సమాఖ్యకు చెందిన సీనియర్ సీఆర్పీల సేవలను వినియోగించుకోవాలని డిీఆర్డీఏ పీడీ రఘువరన్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు సెర్ప్ ఆధ్వర్యంలో మండల పదాధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఈవో ఆదేశాల మేరకు 16 మంది సీనియర్ సీఆర్పీలతో 16 మండలాల్లో, 16 మండల, 12 గ్రామ సమాఖ్యలకు ప్రత్యేక శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీడీ సునీత, డీపీఎంలు పాల్గొన్నారు.
News October 28, 2025
HYD: స్కిల్ ఉంటేనే ఉద్యోగం!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డిగ్రీ, పీజీ పట్టాలు చేత పట్టుకుని HYD వస్తున్న వారికి కార్పొరేట్ కంపెనీలు నిరాశ మిగులుస్తున్నాయి. యంగ్ యూత్ ఎంప్లాయబిలిటీ సర్వే ప్రకారం.. పట్టాలు ఉన్న ప్రయోజనం ఉండటం లేదని, ఉద్యోగం దొరకటం లేదని పేర్కొంది. పట్టాతో పాటు స్కిల్ ఉండి, అనుభవం కలిగిన వారికి రూ.40 వేల పైగా శాలరీతో ఉద్యోగాలు వస్తున్నాయని, లేదంటే రూ.15 వేలు రావటం కష్టంగా ఉందని పేర్కొంది.


