News February 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దొడ్డి కొమురయ్య పాట షూటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
> పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
> సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మహా ధర్నాకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నేతలు
> సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
> ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా నిలిచిన లక్ష్మీ నారాయణపురం విద్యార్థులు.
Similar News
News November 28, 2025
ADB: 4 పంచాయతీల్లో సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నిక

సిరికొండ మండలంలో 4 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. రిమ్మలోని జంగుబాయి, రాయిగూడలో లక్ష్మణ్, కుంటగూడలో మీరబాయి, కన్నాపూర్‌లో బాలదేవిబాయిలను గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామ పెద్దలు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒకే రోజు 4 గూడాల్లో ఏకగ్రీవం కావడం విశేషం. గిరిజన సంస్కృతికి అనుగుణంగా గ్రామస్థులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 28, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ WARNING

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.


