News February 12, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> కొడకండ్ల బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు > పాలకుర్తిలో ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన డిసిపి> ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ > తీగారం దుర్గమ్మ ఆలయంలో చోరీ > ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం టీపీసీసీ సభ్యులు అమృత రావు > కేటీఆర్‌ను కలిసిన తాటికొండ రాజయ్య > కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ను కలిసిన ఎంపీ కడియం కావ్య.

Similar News

News February 12, 2025

గ్రేటర్ HYD లైబ్రరీల్లో సిబ్బంది కొరత..!

image

గ్రేటర్ HYDలోని అనేక గ్రంథాలయాల్లో ఇప్పటికి సిబ్బంది లేక తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నట్లు పాఠకులు తెలుపుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ సహా, HYD కేంద్రంగా ఉన్న అనేక గ్రంథాలయాల్లో తృతీయ శ్రేణి రికార్డు సహాయకులు సైతం లేరు. గ్రంథాలయాలలో ఉన్న ఖాళీలన్నింటిని నింపాలని విద్యార్థులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.

News February 12, 2025

వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

image

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 12, 2025

మేడ్చల్ జిల్లాలో సిజేరియన్‌లు భారీగా పెరిగాయి

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయి. కొద్దిసేపు గర్భిణీకి నొప్పులు రాగానే తట్టుకోలేకపోవడంతో ఒత్తిడి తెచ్చి కుటుంబీకులు సీజేరియన్ కోసం అడుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలో 56కుపైగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. సాధారణ ప్రసవాలకు మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగుతుండటంతో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!