News February 12, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొడకండ్ల బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు > పాలకుర్తిలో ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన డిసిపి> ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ > తీగారం దుర్గమ్మ ఆలయంలో చోరీ > ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం టీపీసీసీ సభ్యులు అమృత రావు > కేటీఆర్‌ను కలిసిన తాటికొండ రాజయ్య > కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ను కలిసిన ఎంపీ కడియం కావ్య.
Similar News
News March 22, 2025
MLAకి రూ.2 లక్షలు చెల్లించండి: విశాఖ కోర్టు

పలాస MLA గౌతు శిరీషకు రూ.2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
News March 22, 2025
మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.