News February 14, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత >కొడకండ్లలో అమానుష ఘటన 3 రోజులుగా అంత్యక్రియలు నిలిపివేత >జనగామలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం >సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి స్టేషన్ ఘనపూర్: ఆర్డీవో
>స్టేషన్ ఘనపూర్ లో బీజేపీ నేతల సన్నాహక సమావేశం >కార్యకర్తలు ధైర్యంతో ముందుకు వెళ్లాలని తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.

Similar News

News October 28, 2025

PDPL: NOV 2 నుంచి గోదావరి మహా హారతి

image

కార్తీక మాసంలో నిర్వహించే గోదావరి మహా హారతి కార్యక్రమం NOV 2న మంథని నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6న అంతర్గాంలో, 9న ధర్మపురిలో, 12న గోదావరిఖనిలో నిర్వహించే గోదావరి మహా హారతి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. BJP జాతీయ నాయకులు మురళీధర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

News October 28, 2025

నర్సీపట్నం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు

image

నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ప్రజా రవాణా సంస్థ డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ తదితర రూట్ల బస్సులను 3రోజుల పాటు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి బస్సులను చింతపల్లి వరకే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

News October 28, 2025

అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

image

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.