News February 8, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం
Similar News
News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 23, 2025
BJP మెడలు వంచి తీరుతాం: కేటీఆర్

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News March 23, 2025
తిరువూరు: ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

తిరువూరుకు చెందిన తల్లీ, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు భద్రాది జిల్లాలో దమ్మపేట (M) గాంధీనగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వస్తున్న తల్లీ, కుమారుడు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు తిరువూరు (M) ముష్టికుంట్లకు చెందిన సరస్వతి (70), కృష్ణ (54)గా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.