News March 11, 2025

జనగామ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

జనగామ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 34 డిగ్రీలు, రేపు 32-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News October 25, 2025

NRPT: డిజిటల్‌ భద్రతపై అవగాహన సదస్సు

image

డిజిటల్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ…
ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో డిజిటల్‌ బాధ్యతా భావం పెంచి, సైబర్ భద్రత సంస్కృతిని బలపరుస్తాయని అన్నారు. హైద్రాబాద్‌కు చెందిన సైబర్ నిపుణులు, న్యాయవాది రూపేష్ మిత్తల్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

News October 25, 2025

నారాయణపేట: చిరుత పులి మృతి

image

నారాయణపేట జిల్లా పేరపళ్ళ రెవెన్యూ అటవీ ప్రాంతంలో శనివారం స్థానికులు ఒక చిరుత పులి మృతిచెందినట్లు గుర్తించారు. ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల్ ఉద్దీన్‌తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. చిరుతపులి మృతికి కారణాలపై విచారణ చేస్తామన్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కళేభరం తరలించారు. పోస్టుమార్టం తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

News October 25, 2025

ధర్మవరంలో ఈ నెల 27న ఫ్లోర్ బాల్ జిల్లా ఎంపిక పోటీలు

image

జిల్లాలోని ఈ నెల 27న ఫ్లోర్ బాల్ జిల్లా ఎంపిక పోటీలు ధర్మవరం బిఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ మైదానంలో నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఫ్లోర్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ ప్రసాద్ తెలిపారు. అండర్-12, 17 విభాగంలోని బాల, బాలికలకు పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికైన క్రీడాకారులను నవంబర్ 2న నరసరావుపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.