News February 13, 2025

జనగామ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

జనగామ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News January 11, 2026

భద్రాద్రి రామాలయంలో విలాస ఉత్సవాలు

image

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల ‘విలాస ఉత్సవాలు’ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం స్వామివారు గోకులరామం వనవిహార మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాదిమంది భక్తులు పాల్గొని తరించారు. శ్రీరామ నృత్యాలయం కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

News January 11, 2026

HYD: ఆ నలుగురు లేకపోయినా!

image

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.

News January 11, 2026

పాలమూరు పురపాలికల్లో ‘ఆమె’ కీలకం

image

MBNR జిల్లాలో ఒక కార్పొరేషన్​, 2 మున్సిపాలిటీల్లో 2,853 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వనపర్తి జిల్లాలో అయిదు మున్సిపాలిటీలలో 2,410, గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలలో 2,737.. నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 2,040, నాగర్​కర్నూల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలుండగా కొల్లాపూర్ మినహా మిగతా రెండింటిలో 530 మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 35 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.