News March 5, 2025

జనగామ జిల్లాలో మండుతున్న ఎండ

image

జనగామ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 32 నుంచి 34 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.

Similar News

News December 3, 2025

మెదక్: పల్లెల్లో జోరుగా ఎన్నికల దావత్‌లు

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఈసారి గతంలో కంటే భిన్నంగా ప్రచార పర్వం ప్రారంభమైంది. తెల్లవారుజామునే ప్రచారాలు మొదలు పెట్టి, చీకటి పడగానే దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో చుక్క- ముక్కతో వివిధ వర్గాల వారీగా విందులు ఇస్తున్నారు. ఎన్నికల దావత్‌లు కొత్త వ్యాపారులకుకిక్ ఇస్తున్నాయి.

News December 3, 2025

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

image

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.

News December 3, 2025

మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్‌లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.