News March 5, 2025
జనగామ జిల్లాలో మండుతున్న ఎండ

జనగామ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 32 నుంచి 34 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.
Similar News
News March 21, 2025
నాగర్‌కర్నూల్: కరుడుగట్టిన నిందితుడికి రిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ మండలాలతోపాటు స్థానికంగా పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రిమాండ్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గంలో దొంగతనాలు పెరిగిపోవడంతో జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం పాలమూరు చౌరస్తాలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.
News March 21, 2025
నారాయణపేట జిల్లా ఎస్పీ WARNING

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 7,631 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.
News March 21, 2025
మార్చి21: చరిత్రలో ఈరోజు

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం