News February 2, 2025
జనగామ: జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులు

జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు చేశారు. శనివారం మిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు టీం జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి పాలు, పాలపదార్థాల తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన పదార్థాలను సీజ్ చేసి రూ. 27వేల పెరుగును ధ్వంసం చేశారు.
Similar News
News December 4, 2025
NGKL: జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండ మండలం సిర్సనగండ్ల 20.1, పదర మండలం వంకేశ్వర్ 20.7, వెల్దండ మండలం బొల్లంపల్లి 20.9, నాగర్కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో 21.1, తెలకపల్లిలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 4, 2025
మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు


