News January 29, 2025

జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీడీవోలతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీవోలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగాలన్నారు. 

Similar News

News February 25, 2026

శర్వానంద్ మాస్ లుక్

image

శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోగి’ నుంచి ఆయన లుక్ విడుదలైంది. అందులో శర్వా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చేతిలో ఆయుధంతో దర్శనమిచ్చారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కాబోతోంది.

News February 25, 2026

ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

image

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.