News January 29, 2025

జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీడీవోలతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీవోలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగాలన్నారు. 

Similar News

News February 16, 2025

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచులు!

image

IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోంగ్రౌండ్ విశాఖపట్నంలో రెండు మ్యాచులు ఆడనుందని సమాచారం. DC తన మిగతా మ్యాచులను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో 3 మ్యాచులు ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ సెంటర్ కింద పంజాబ్ ఈ స్టేడియాన్ని ఎంచుకుంది. వచ్చే నెల 22 నుంచి IPL ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ RCB vs KKR మధ్య ఉంటుందని సమాచారం.

News February 16, 2025

సంగారెడ్డి: రేపు విధులలో చేరాలి: డీఈవో

image

డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై నియామక పత్రాలు అందుకున్న నూతన ఉపాధ్యాయులందరు రేపు పాఠశాలలో విధులలో చేరాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఫిట్నెస్ సర్టిఫికెట్, అగ్రిమెంట్ కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రేపు సాయంత్రంలోగా పంపాలని సూచించారు.

News February 16, 2025

ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

image

ప్రస్తుతం ఆన్‌లైన్, పార్సిల్‌లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్‌ను నాశనం చేసి డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో ఫుడ్ తినడం బెటర్.

error: Content is protected !!