News February 1, 2025
జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పోటాపోటీ!

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డితో పాటు మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, ఊడుగుల రమేశ్, సౌడ రమేశ్, బెజాడీ బీరప్ప, విద్యాసాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈసారి బీసీ లేదా ఎస్సీలకు ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఎవరికి ఇస్తారనేది నాయకుల్లో ఉత్కంఠగా నెలకొంది.
Similar News
News December 8, 2025
తిరుచానూరు: ఆయన పేరు కలెక్షన్ కింగ్ అంటూ చర్చ..!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తీర్థం, శఠారి ఇస్తూ వీఐపీల నుంచి, సామాన్య భక్తుల నుంచి సంబంధిత అనధికారిక స్వామి కానుకలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీతం లేని వ్యక్తికి ప్రతిరోజు కలెక్షన్ వేల రూపాయల ఆదాయం అని తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే విజిలెన్స్ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్న. దీని వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నట్లు సమాచారం.
News December 8, 2025
జగిత్యాల: ‘గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ అశోక్ కుమార్, వచ్చిన ఆరుగురు అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేస్తూ, స్టేషన్లలో వినతులను మర్యాదగా స్వీకరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
News December 8, 2025
చాట్రాయి: సామాన్యుల సమస్యలపై స్పందించిన మంత్రి

చనుబండలో సామాన్యులు చెప్పిన సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి కొలుసు సారథి, సొంత ఖర్చులతో డ్రైనేజీలో తూరలు వేయించారు. సోమవారం చనుబండలో మంత్రి ఈ పనులు పూర్తి చేయించడంతో బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 48 గంటల క్రితం మంత్రి గ్రామానికి వచ్చిన సందర్భంలో ప్రజలు సమస్యను ప్రత్యక్షంగా చూపించారని, వెంటనే పనులు పూర్తి చేయడం సంతోషదాయకంగా ఉందని పలువురు పేర్కొన్నారు.


