News March 3, 2025
జనగామ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ అధికారిగా విక్రమ్‌కుమార్

జనగామ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్‌కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్‌కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 14, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* లింగంపేట్: రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం
* దోమకొండ: అంచనూరులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
* భిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
* ఎల్లారెడ్డి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
* నిజాంసాగర్: రెండో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు
* భిక్కనూర్: జాతీయ రహదారిపై లారీ బోల్తా
News December 14, 2025
అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News December 14, 2025
TTD నిధులతో SV జూ అభివృద్ధి

తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.97 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జంతువుల భద్రత, సందర్శకుల సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. బోర్డు తీర్మానం 474కి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


