News April 3, 2025
జనగామ: దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యా నిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద జిల్లాలోని బీసీ, ఈ బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు www.telanganaepass.cgg.gov వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News April 12, 2025
రాజమండ్రి: చిన్నారికి ప్రముఖుల ప్రశంస

రాష్ట్రాలు వాటి రాజధానులు, 16 జాతీయ చిహ్నాలు, 7 ఖండాలు సునాయాసంగా చెప్పి అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అభినందించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మున్సిపల్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆ చిన్నారిని అభినందించారు.
News April 12, 2025
NZB: పోలీసుల అదుపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. నరేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు 6వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి అర్సపల్లి బైపాస్ రోడ్డు వద్ద అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
News April 12, 2025
ఈ నెల 25/27న TG ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం పూర్తిచేసి ఆన్లైన్లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.