News December 28, 2024
జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

బస్టాండ్ ప్రదేశాలలో(రద్దీ) మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.13 లక్షల విలువైన 171.23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
Similar News
News October 17, 2025
వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్పై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.