News January 25, 2025
జనగామ: నాలుగు సంక్షేమ పథకాల అమలుకు రేపే శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత(రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక నాలుగు సంక్షేమ పథకాల అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
Similar News
News December 10, 2025
సిరిసిల్ల: ఓటు చోరీకి మద్దతుగా 27వేల సంతకాల సేకరణ

టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఓటు చోరీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలో 27 వేల సంతకాలను సేకరించినట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని నిరూపిస్తూ సేకరించిన సంతకాలను గాంధీభవన్లో అప్పగించామని పేర్కొన్నారు. ఓట్ చోరీ జరిగిన విషయం రాష్ట్రపతి వరకు చేరవేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు.
News December 10, 2025
ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్: గద్వాల్ ఎస్పీ

గద్వాల, గట్టు, కేటి దొడ్డి, ధరూర్ మండలాల్లో జరిగే మొదటి విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి కూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సభలు సమావేశాలు, ప్రచారం లౌడ్ స్పీకర్ వినియోగం, బైక్ ర్యాలీలు నిషేధమన్నారు.
News December 10, 2025
మొగల్తూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మొగల్తూరు (M) పేరుపాలెం సౌత్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు (75) అనే వృద్ధుడు సైకిల్పై వెళ్తుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


