News February 7, 2025
జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 1, 2025
సూర్యాపేట: అత్యధిక ఓటర్లున్న గ్రామ పంచాయతీలు ఇవే

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా టాప్-10 గ్రామాల జాబితా వెలువడింది. మేళ్లచెరువు గ్రామం 10,567 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచి జిల్లాలోనే అతిపెద్ద గ్రామంగా రికార్డు సృష్టించింది. తర్వాతి స్థానాల్లో దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041) ఉన్నాయి. మిగతా ఐదు గ్రామాల్లో తుంగతుర్తి, మునగాల, పొనుగోడు, రామాపురం, నూతనకల్ ఉన్నాయి.
News December 1, 2025
నేతివానిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా తిరుపతమ్మ నామినేషన్

మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సహకరించాలని కోరారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికి ఓటు వేయాలన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>


