News February 7, 2025

జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News July 9, 2025

HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

image

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News July 9, 2025

5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

image

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.