News February 27, 2025
జనగామ: నేడు డయల్ యువర్ డీఎం

ఆర్టీసీ జనగామ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ తమ సమస్యలతో పాటుగా సూచనలను తెలియజేయాలన్నారు. 9959226050 నెంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News February 27, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News February 27, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.0°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.4, నుస్తులాపూర్ 37.1, తాంగుల, పోచంపల్లి 36.3, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లె 35.9, జమ్మికుంట 35.7, అర్నకొండ 35.6, కరీంనగర్ 35.5, తాడికల్, దుర్శేడ్, కొత్తపల్లి-ధర్మారం 35.4, కొత్తగట్టు 35.1, గంగాధర 34.9, గుండి 34.8, వీణవంక 34.6, ఇందుర్తి 34.5, వెదురుగట్టు 34.2°Cగా నమోదైంది.
News February 27, 2025
BNGR: టైర్ పగిలి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి గాయం..

రోడ్డుపై వెళ్తున్న వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలైన ఘటన భువనగిరిలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల వివరాలిలా.. ములుగు జిల్లా జగన్నాథపురానికి చెందిన రామలక్ష్మి బంధువుల ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదైంది.