News February 27, 2025
జనగామ: నేడు డయల్ యువర్ డీఎం

ఆర్టీసీ జనగామ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ తమ సమస్యలతో పాటుగా సూచనలను తెలియజేయాలన్నారు. 9959226050 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 20, 2025
బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్‌కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.
News March 20, 2025
పన్ను వసూళ్ళలో హుజూరాబాద్‌కు మొదటిస్థానం

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.
News March 20, 2025
నిర్మల్: ‘మున్సిపాలిటీల నిధులను సమర్థవంతంగా వాడాలి’

పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు మంజూరైనా నిధులను పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.